కాబోయే కపిల్ దేవ్, ఇండియా జాక్ కల్లీస్, ఇండియాకు ఆల్ రౌండర్ లేని లోటు తీరుస్తాడు, ఇంగ్లాండ్ కు బెన్ స్టోక్స్ మాదిరి మన జట్టుకి కీ ప్లేయర్… టీం ఇండియా యువ ఆటగాడు హార్దిక్ పాండ్యా గురించి నేషనల్ మీడియా, ఫాన్స్, లోకల్ మీడియా, అనలిస్ట్ లు చెప్పిన కబుర్లు ఇవి. టీం ఇండియాకు ఆల్ రౌండర్ లోటు ఉండటం… ప్రధానంగా పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ లేకపోవడంతో హార్దిక్ పాండ్యా ఆశాదీపంగా కనిపించాడు.
కాని మనాడి ఆట తీరు మ్యాచ్ మ్యాచ్ కు దిగజారుతుంది గాని ఏ మాత్రం మెరుగుపడటం లేదు. కోట్లు పెట్టి కొనుక్కున్న ముంబై జట్టుకి గాని భారీ అంచనాలతో జట్టులోకి తీసుకున్న టీం ఇండియా యాజమాన్యానికి కూడా అతనితో ఏ ఉపయోగం లేదు. ఆడటం లేదని ఇర్ఫాన్ పటాన్ ను, శిఖర్ ధావన్ లాంటి స్టార్ ఆటగాళ్లను పక్కన పెట్టిన భారత జట్టు యాజమాన్యం… పాండ్యా విషయంలో మాత్రం అలా చేయకపోవడం విడ్డూరంగా ఉంది.
పరిమిత ఓవర్ల క్రికెట్ లో రాణించడం కష్టమవుతున్న తరుణంలో మనాడ్ని టెస్ట్ జట్టుకి తీసుకెళ్ళారు. సాంప్రదాయ క్రికెట్ లో కూడా అతను పెద్దగా ఆడింది లేదు. ఈ ఏడాది ఐపిఎల్ లో ముంబై తరుపున 12 మ్యాచ్ లు ఆడిన ఈ సో కాల్డ్ స్టార్ ఆల్ రౌండర్ ఒక్క మ్యాచ్ లో కూడా ఒక్క బంతి కూడా వేయలేదు. 12 మ్యాచ్ లు ఆడి 40 పరుగుల అత్యధిక స్కోర్ తో 127 పరుగులు చేసాడు. స్ట్రైక్ రేట్ కూడా పెద్ద గొప్పగా లేదు. యావరేజ్ చూస్తే 14 ఉంది.
ఇక పొట్టి ప్రపంచ కప్ లో కూడా అతను సమర్ధంగా ఆడే అవకాశం కనపడటం లేదు. బ్యాటింగ్ చేస్తాడని బౌలింగ్ కి పక్కన పెట్టారు. బ్యాటింగ్ కి వచ్చి పది పరుగులు చేసి ఫీల్డింగ్ కి దూరంగా ఉంటున్నాడు. పాకిస్థాన్ తో మ్యాచ్ లో గాయం పేరుతో మైదానంలోకి వచ్చి ఫీల్డింగ్ చేయలేదు. పాండ్యా ప్లేస్ లో శార్డుల్ ఠాకూర్ ఫీల్డింగ్ చేసాడు. కనీసం ఠాకూర్ ని తీసుకున్నా బౌలింగ్, బ్యాటింగ్ లో మంచి పదును ఉండేది. మరి పాండ్యాను ఎందుకు జట్టులో కొనసాగిస్తున్నారో కనీసం కెప్టెన్ కోహ్లీకి అయినా తెలుసో లేదో.