పొట్టి ఫార్మాట్ ప్రపంచ కప్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ మ్యాచ్ లో ఎలా అయినా సరే గెలవాలని పాక్ అన్ని వ్యూహాలను సిద్దం చేసుకుని మైదానంలో అడుగు పెట్టింది. టాస్ గెలవడం బౌలింగ్ ఎంచుకోవడం ఆ తర్వాత టీం ఇండియాను సమర్ధవంతంగా కట్టడి చేయడం అన్నీ ఒక దాని తర్వాత ఒకటి అలా జరిగిపోయాయి. అయితే ఇక్కడ కోహ్లీ అంచనా చాలా వరకు తప్పు అయింది.
జట్టులో అయిదుగురు బౌలర్లు ఉండాలి అనే వ్యూహంతో ముందుకు వెళ్ళిన కోహ్లీ… బ్యాటింగ్ సామర్ధ్యంపై సరిగా అంచనా వేసుకోలేకపోయాడు అనే మాట వినపడుతుంది. హార్దిక్ పాండ్యాను పక్కన పెట్టి… ఇషాన్ కిషన్ ను బ్యాటింగ్ లో తీసుకుని ఉంటే బాగుండేది. బౌలింగ్ ఎలాగో వేయనప్పుడు హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ కోటాలో జట్టుకి అనవసరం. ఇషాన్ కిషన్ ను తీసుకుని… రాహుల్ ని అయిదో స్థానంలో ఆడించి, రోహిత్ తో ఓపెనింగ్ కి ఇషాన్ కిషన్ ను పంపాల్సింది. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కాబట్టి హిట్ అయ్యే అవకాశం ఉంటుంది.