Analysis International

ఆ ఇద్దరి మీదనే ద్రావిడ్ ఫోకస్…? అతన్ని సాగనంపుతాడా…?

vencatesh
Written by vencatesh

టీం ఇండియాలో కీలక మార్పులకు సమయం ఆసన్నమైందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. జట్టుకి కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కెప్టెన్ నుంచి ప్రతీ ఒక్కటి మార్చే ప్రయత్నం చేస్తున్న ద్రావిడ్ ఇప్పుడు కొంత మంది కీలక ఆటగాళ్ళ ఫిట్నెస్ మీద ఎక్కువగా ఫోకస్ చేసే సంకేతాలు కనపడుతున్నాయి. గత కొన్ని రోజులుగా జట్టుకి భారంగా మారిపోయాడని భావిస్తున్న హార్దిక్ పాండ్యా మీద తొలి వేటు వేసే అవకాశం కనపడుతుంది.

పొట్టి ప్రపంచకప్ లో అతని ఆట తీరు చూసిన ఎవరు అయినా సరే జట్టుకి భారంగా మారిపోయాడు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తారు. ఆల్ రౌండర్ గా జట్టులోకి వచ్చి బౌలింగ్ చేయకుండా బ్యాటింగ్ చేయకుండా వెన్ను నొప్పి అనే కారణంతో ఫీల్డింగ్ చేయకుండా అతను జట్టులో ఎందుకు ఉన్నాడో ఎవరికి అర్ధం కాని పరిస్థితి నెలకొంది. దానికి తోడు అతని సోదరుడు క్రునాల్ పాండ్యాను కూడా కోహ్లీ జట్టులోకి తీసుకొచ్చాడు.

ఈ ఇద్దరి ఆట తీరు చూసిన చాలా మంది… ఎందరో యువకులు జట్టులో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఒకే ఇంటి నుంచి ఇద్దరికీ ఎలా అవకాశం ఇస్తారని ప్రశ్నించారు. సరిగా ఆడితే బాగానే ఉంటుంది గాని ఆడకుండా జట్టులో కొనసాగించి అభిమానులను ఇబ్బంది పెడుతున్నారని ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక ఇప్పుడు హార్దిక్ ఆట చూసిన చాలా మంది దండం పెడుతున్నారు.

అయితే ద్రావిడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టె అవకాశం ఉందని టాక్ ఉంది. అతని ఆట తీరులో రెండేళ్ళ నుంచి పెద్దగా సంచలనాలు ఏవీ లేవు కాబట్టి ఆల్ రౌండర్ కోటాలో జట్టులో అవసరం లేదని ద్రావిడ్ భావిస్తున్నట్టు సమాచారం. గాయపడిన తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీకి పంపించకుండా మళ్ళీ జట్టులో ఎలా ఎంపిక చేసారనే ప్రశ్న కూడా ద్రావిడ్ నుంచి ఉత్పన్నమైందని అంటున్నారు.

మొదటి వేటు హార్దిక్ పాండ్యా మీద పడుతుందని అంటున్నారు. ఆ తర్వాత రిశబ్ పంత్ మీద ఫోకస్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఫిట్నెస్ పరంగా పంత్ లో ఏ ఇబ్బంది లేకపోయినా కీపింగ్ విషయంలో మాత్రం పంత్ పై ఆరోపణలు ఉన్నాయి. ఇక సందర్భానికి తగినట్టు ఆడకుండా తన సొంత ఆట తీరుని చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ఇద్దరి మీద స్పెషల్ ఫోకస్ పెట్టె అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.

About the author

vencatesh

vencatesh

Hello, I am Venkat. Professional Cricket Content Writer. Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries.

1 Comment

Leave a Comment