Breaking International

కోహ్లీ బ్యాటింగ్ ని ఇన్ని కోట్ల మంది చూసారా…?

vencatesh
Written by vencatesh

ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు ఫాన్స్ లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. మ్యాచ్ ఉందని తెలిసిన రోజు నుంచి మ్యాచ్ అయ్యే వరకు కూడా ఫాన్స్ సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. ఏ చిన్న వార్త వచ్చిన చూస్తూ ఉంటారు. గతంలో అయితే మ్యాచ్ గురించి ఎన్నో అంచనాలు వేసుకుని… చర్చలు కూడా పెట్టె వాళ్ళు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే టీవీ ల ముందే ఉంటారు జనాలు.

ఇక ఇప్పుడు టి 20 వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ పాకిస్తాన్ తో కావడంతో టీవీ లతో పాటుగా ఆన్లైన్ లో కూడా మ్యాచ్ ను వీక్షిస్తున్నారు. మ్యాచ్ కోసం పిసినారి వాళ్ళు కూడా నెట్ బ్యాలెన్స్ వేసుకునే పరిస్థితి ఉంటుంది మరి. ఇదే టైం లో ప్రసార హక్కులు దక్కించుకున్న ఆన్లైన్ ఓటీటీ ఫ్లాట్ ఫాం హాట్ స్టార్ లో అయితే ఫాన్స్ మ్యాచ్ ను ఎగబడి చూసారు.

ఆదివారం మ్యాచ్ లో కోహ్లీ… బ్యాటింగ్ చేసే సమయంలో సరిగా 18 వ ఓవర్ లో ఒక కోటీ 20 లక్షల మంది మ్యాచ్ ను వీక్షించారు. అంతకు ముందు కూడా కోహ్లీ బ్యాటింగ్ కోసం 90 లక్షల నుంచి కోటి మంది చూసారు. వీళ్ళు అందరూ కూడా హాట్ స్టార్ లో ప్రీమియం ఖాతాలు ఉన్న వాళ్ళే. హాట్ స్టార్ ప్రీమియం ప్రకారం ఒక్కొక్కరు 199 నుంచి ఖర్చు చేయాలి. 199 x ఒక కోటి 20 లక్షలు అంటే…? దాంతో పాటు టీవీ లో చూసే వాళ్ళు…? అంటే కోహ్లీ బ్యాటింగ్ ని కోట్లలోనే చూసారు అన్నట్టు.

ఇమేజ్: హాట్ స్టార్ సౌజన్యంతో

About the author

vencatesh

vencatesh

Hello, I am Venkat. Professional Cricket Content Writer. Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries.

Leave a Comment