97 ఓవర్లు… భారీ టార్గెట్… టీంలో సగం మందికి దెబ్బలు…
క్రీజ్‌లోకి వచ్చిన కాసేపటికే లైఫ్… కాని నేను బెదరలేదన్నాడు…
నా కోచ్ కోసం ఒక్క టెస్ట్ అయినా ఆడతా అన్నాడు… ఆ మాట అనేసిన 2 నెలలకే టీంలోకి వచ్చేసాడు..
అన్ని దేశాలకు క్రికెట్ ఆడటం వేరు… భారత్‌కు ఆడటం వేరు…
అభిమానులకు నీతీ జాతీ ఉండదు… క్యాచ్ వదిలేస్తే ప్రాణం పోయినంతగా చూస్తారు…
కీపర్‌గా ఫెయిల్ అయ్యాడని… గాయం అని నాటకం ఆడి బెంచ్‌లో కూర్చో అన్నారు…
అంత నమ్మకం ఏంటో తెలీదు… నేను ఆడతా నువ్వు చూడు అన్నట్టు… 32 ఏళ్ళ సీనియర్ ఆచితూచి బ్యాటింగ్ చేస్తే…
23 ఏళ్ళ పంత్ సిక్సులు ఫోర్లు కొట్టేసాడు… పంత్ ఆడితే గెలిచేస్తాం అని ఫాన్స్ నమ్మేసారు…
అనుభవం తక్కువ కదా… ఊపేసాడు 97 పరుగులకు అవుట్ అయ్యాడు…
గుర్తుండే ఉంటుంది… 2018 ఇంగ్లాండ్ సీరీస్‌లో అంతే… రాహుల్‌తో కలిసి చుక్కలు చూపించాడు…
టీం గెలిస్తే… పంత్ హీరో… మర్చిపోలేని మ్యాచ్ అయ్యేది…
గంగూలీ ఎవడ్నీ నమ్మడు… పంత్ ఆడకపోయినా టీంలో ఉంటాడని పదే పదే చెప్తాడు…
గంగూలీకి ద్రావిడ్‌కి ఆటగాడిలో క్రికెట్ మాత్రమే కనపడుద్ది… పంత్‌లో గంగూలీ చూసిందదే…
ఇంతకి యూత్‌కి ఏం చెప్పాడో తెలుసా…
“ గెలుపు ఓటమి కాదు… నువ్వు చేసిన పోరాటమే నీ విజయం” అన్నాడు…
ఆల్ ది బెస్ట్ పంత్… ఇండియా గిల్‌క్రిస్ట్ అవ్వాలి నువ్వు…