Analysis International

ఇండియాకు బలం, పాక్ కు భయం ఆ ఒక్కడే…!

vencatesh
Written by vencatesh

దాయాదుల పోరు అంటే చాలు మనకు వేరే పని ఉండదు, నాకు అయితే మనసు మొత్తం అక్కడే ఉంటుంది. ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్న ఇండియా… ప్రపంచ క్రికెట్ లో గౌరవం కోసం పాకులాడే పాకిస్తాన్ మధ్య పోటీ ఎలా ఉంటుంది అనే చర్చలే అన్నీ కూడా. బెట్టింగ్ రాయళ్ళకు అయితే నిద్ర ఉండదు… తిండి కూడా తినరు. రెండు దేశాల మధ్య ఏడాదికో రెండేళ్ళకో ఒక మ్యాచ్ మినహా రెగ్యులర్ సీరీస్ లు లేకపోవడంతో మనం చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటాం.

Image

సరే ఇప్పుడు టి20 ప్రపంచ కప్ వచ్చేసింది… ఈ టోర్నీలో ఇదే హైలెట్ మ్యాచ్. ఇండియా నుంచి ప్రకటనలు ఏమీ లేకపోయినా… పాకిస్తాన్ ఫాన్స్ లో జోష్ నింపడానికి ఆ జట్టు కెప్టెన్ నుంచి మాజీ ఆటగాళ్ళ వరకు ఇండియాను ఓడిస్తాం అంటూ సందడి చేస్తున్నారు. మరి ఈ మ్యాచ్ లో ఎవరిది పై చేయి… ఎవరి బలం ఎలా ఉందనేది చూస్తే…Image

 

రెండు జట్లలో కూడా ఒక్కడే అత్యంత బలంగా కనపడుతున్నాడు. అతడే రవీంద్ర జడేజా… టీం లో ఉన్నాడో లేదో కూడా తెలియకుండా ప్రతీ మ్యాచ్ ఆడే ఈ రాజపుత్… ఈ మ్యాచ్ లో ఎలా ఆడతాడో అనేదే ఫాన్స్ అందరిలో ఉన్న ఉత్కంట. పిచ్ ఎలాంటిది అయినా సరే తన పని తాను చేసేస్తాడు… జట్టు ఏది అయినా సరే తన ఆట తీరుతో ప్రత్యర్ధికి చుక్కలు చూపిస్తాడు ఈ ఎడమ చేతి క్రికెటర్.

Image

దాదాపుగా ఆరేళ్ళ నుంచి జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయిన ఈ ఆల్ రౌండర్… బ్యాటింగ్ ఆల్ రౌండర్ గా జట్టులో చేరి ఆ తర్వాత బౌలింగ్ ఆల్ రౌండర్ గా మారిపోయి… ఇప్పుడు కంప్లీట్ ఆల్ రౌండర్ గా చుక్కలు చూపిస్తున్నాడు. బౌలింగ్ లో రెండు వికెట్ లు, బ్యాటింగ్ లో 30 పరుగులు. ప్రతీ మ్యాచ్ లో దాదాపుగా అతని నుంచి ఉండే ప్రదర్శన ఇది. ఫీల్డింగ్ అయితే కళ్ళు బైర్లు కమ్మే విధంగా ఉంటుంది.

Image

ఫార్మాట్ కి తగిన విధంగా ఆడే జడేజాకు… టి20 లో అపార అనుభవం ఉంది. ఐపిఎల్ లో 200 మ్యాచ్ లు, అంతర్జాతీయ క్రికెట్ లో 50 మ్యాచ్ లు ఆడాడు. సీరీస్ కు ఎంపిక అయితే దాదాపుగా టీంలో ఉంటాడు. గాయాల పాలు కావడం కూడా చాలా తక్కువ. ఐపిఎల్ లో 200 మ్యాచ్ లు ఆడి, 27 యావరేజ్ తో 151 ఇన్నింగ్స్ లలో 2300 పైగా పరుగులు చేసాడు. స్ట్రైక్ రేట్ కూడా మెరుగ్గానే ఉంది.

Image

ఇక బౌలింగ్ విషయానికి వస్తే అంతర్జాతీయ టి20 లలో 7.1 ఎకామనీ ఉంటే, ఐపిఎల్ లో 7.61 ఉంది. పొట్టి ఫార్మాట్ లో అన్ని మ్యాచ్ లు ఆడిన ఒక ఆల్ రౌండర్ కు 7 ఎకానమీ అంటే అతను లెజెండ్ అన్నట్టే. ఫీల్డింగ్ లో కూడా గ్రౌండ్ లో చాలా చురుగ్గా ఉండే ఈ ఆల్ రౌండర్… కీలకమైన సమయంలో బ్యాటింగ్ కి వస్తే మాత్రం బంతిని బలంగా బాదే సత్తా ఉన్న ఆటగాడు.  ఇటీవల ఐపిఎల్ లో అతని ఆట తీరు, చివరి ఓవర్లలో బ్యాటింగ్ కి వస్తే ఎలా ఉంటుందో చూపించాడు. నిలకడకు మారుపేరు అయిన ఈ ఆల్ రౌండర్ ప్రదర్శనపైనే ఒక రకంగా జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.

Image

సీనియర్ ఆటగాడు కావడం, మ్యాచ్ స్వరూపం మార్చే ఆటగాడు కావడంతో కెప్టెన్ కోహ్లీ అతన్ని కచ్చితంగా తుది జట్టులో ఉంచుతాడు. ఇక పాక్ జట్టు కూడా జడేజా మీద ఫోకస్ కచ్చితంగా పెడుతుంది. గత రెండేళ్ళ నుంచి అతని ఆట తీరు అంతర్జాతీయ మ్యాచ్ లలో చాలా వేగంగా మారుతూ వచ్చింది కాబట్టి అతని గురించి కచ్చితంగా పాక్ దృష్టి పెడుతుంది. ఆల్ రౌండర్ కావడంతో అతని కోసం కచ్చితంగా పాక్ వ్యూహాలు సిద్దం చేసుకుంటుంది. తన స్పిన్ తో దిగ్గజ ఆటగాళ్లకు కూడా చుక్కలు చూపించిన ఈ రాక స్టార్ ఏ రేంజ్ లో ఈ మ్యాచ్ లో చెలరేగుతాడో చూడాలి.

About the author

vencatesh

vencatesh

Hello, I am Venkat. Professional Cricket Content Writer. Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries.

Leave a Comment