మొదటి ఇన్నింగ్స్‌లో తక్కువ పరుగులకు ఆల్ అవుట్ అయితే ఓడినట్టు కాదని…
191కి ఆల్ అవుట్ అంటే నేనేం ఓడిపోతారని కంగారు పడలేదు…
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ 99 పరుగుల లీడ్ అన్నా సరే నేను కంగారు పడలేదు…
మ్యాజిక్ జరిగిందని అంటారు గానీ అనను నేను…
పర్ఫెక్ట్ టెస్ట్ క్రికెట్ ఆడింది ఇండియా…
- ఠాకూర్ మొదటి ఇన్నింగ్స్‌లో చేసిన 57 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో చేసిన 60 పరుగులే మ్యాచ్‌ను గెలిపించాయని నమ్ముతా నేను
- పిచ్ పేస్‌కు అనుకూలంగా ఉంది… ఇంగ్లాండ్ బౌలర్లు స్వింగ్‌ను చక్కగా వాడుకున్నారు…
చివర్లో ఠాకూర్ స్పీడ్‌గా ఆడకపోయి ఉంటే ఇండియా 150 పరుగులు వెనుకబడి ఉండేది…
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్, బెయిర్ స్టో, అలీ లేకపోయింటే 290 చేసే వాళ్ళు కాదు…
ఆ ముగ్గురు బ్యాటింగ్ చూసాక నాకు కలిగిన నమ్మకం ఒక్కటే… రెండో ఇన్నింగ్స్ నుంచే గేమ్ స్టార్ట్ అవుద్దని…
రోహిత్, రాహుల్ పార్టనర్షిప్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది… 99 పరుగులు వెనుకబడి ఉన్నా కంగారు పడలేదు…
రాహుల్ అవుటయ్యాక పుజారా స్లోగా ఆడతాడు అనుకున్నా… కాని చాలా స్పీడ్‌గా ఆడాడు…
కానీ రోహిత్ చాలా జాగ్రత్తగా ఆడి సెంచరీ చేసాడు… అప్పుడు మార్చిన కొత్త బాల్‌ను రాబిన్సన్ చక్కగా వాడుకున్నాడు…
ఒకే ఓవర్లో రోహిత్, పుజారాను అవుట్ చేసాడు… తర్వాత వచ్చిన జడేజా కాస్త జాగ్రత్తగా ఆడాడు…
జడేజా అవుట్ అయ్యాక నేను పంత్ మీద కోహ్లీ మీద నమ్మకం పెట్టుకున్నా…
రహానే మీద నమ్మకం లేదు… కోహ్లీ నుంచి 80 పరుగులు ఆశించా… తక్కువకే అవుటయ్యాడు…
కోహ్లీ అవుటయ్యాక ఠాకూర్‌తో కలిసి పంత్ చాలా స్లోగా ఆడాడు… ఇద్దరూ మ్యాచ్‌ను సేఫ్ జోన్లోకి తెచ్చేసారు…
పంత్ కాసేపు ఉండుంటే… టార్గెట్ 400 పెట్టే వాళ్ళం…
అయినా నాలుగో ఇన్నింగ్స్‌లో అంత స్కోర్ మాటలు కాదు…
ఆఖర్లో బూమ్రా, ఉమేష్ బ్యాటింగ్ మనకు బాగా ప్లస్ అయింది… మ్యాచ్ గెలవడానికి కారణం ఠాకూర్, ఉమేష్, బూమ్రా…
రెండో ఇన్నింగ్స్‌లో జడేజా బౌలింగ్ హైలెట్… జడేజా స్పిన్ దెబ్బకు సేఫ్ గేమ్ ఆడింది…
రహానే ఆడలేదు ఆడలేదంటారు… మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ కెప్టెన్సీ మొత్తం రహానేదే…
మ్యాచ్ అయ్యాక బూమ్రా వెళ్ళి ఫస్ట్ థాంక్స్ చెప్పింది రహానేకే… కోహ్లీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాడు…
జడేజా స్పీన్ ఒక ప్లస్ అయితే బ్యాట్స్‌మెన్ చుట్టూ నలుగురిని పెట్టాడు రహానే…
టెయిలెండర్‌కు పెట్టే ఫీల్డింగ్ రూట్‌కి, హమీద్‌కు పెట్టాడు రహానే…
ఎప్పుడైతే హమీద్‌ను అవుట్ చేసాడో ఇంగ్లాండ్‌లో భయం మొదలైంది… రూట్ క్రీజ్‌లో ఒత్తిడిగా కనిపించాడు…
పోప్ అవుటయ్యాక… ఫ్రీగా ఆడలేకపోయాడు… బాడీ లాంగ్వేజ్ క్లియర్‌గా అర్దమైంది…
రూట్‌ను ఠాకూర్ అవుట్ చేసాక ఇంగ్లాండ్ ఫిక్స్ అయిపోయింది…
ఠాకూర్ ఆల్ ది బెస్ట్… మరో పఠాన్ అవ్వకు… గెలుపుకి ఓటమికి తేడా నువ్వే…
టెస్ట్ క్రికెట్ అందమైంది… అయిదు రోజుల క్రికెట్ నిండుగా అనిపించింది…