టెస్ట్ క్రికెట్ ది బ్యూటీ…
183కి ఫస్ట్ ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ ఆల్ అవుట్…
పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉంది… అండర్సన్, బ్రాడ్, కర్రన్, రాబిన్సన్
నిలబడతామా అనుకున్న తరుణంలో రోహిత్, రాహుల్ అరిపించారు…
రోహిత్ తర్వాత వెంటనే పుజారా అవుట్, కోహ్లీ గోల్డెన్ డక్…
భారమంతా మిడిలార్డర్ పైనే పడింది…
రాహుల్ ఎక్కడా కంగారు పడలేదు… చేసిన 84 పరుగులూ జాగ్రత్తగా చేసాడు…
పంత్ పర్వాలేదనిపించాడు… జడేజా వచ్చాక లీడ్ స్టార్ట్ అయింది…
రాహుల్, జడేజా భాగస్వామ్యం మ్యాచ్‌లో ఇండియాను నిలబెట్టింది…
జడేజా ఆఫ్ సెంచరీ మోస్ట్ వాల్యుబుల్… ఆఖర్లో షమీ, బూమ్రా ఊపుడు మనకు 95 పరుగుల లీడ్ ఇచ్చింది…
పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం… గడ్డి మొత్తం పోయింది… స్వింగ్ కష్టం…
ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో క్రీజ్‌లో నిలబడకుండా చూడాలి… స్పిన్ తిరగొచ్చు… జడేజా బలం కావొచ్చు…
టీ20 ఏముంది… టెస్ట్ క్రికెట్లో ఇలా ప్రతీ ఆటగాడి పరుగూ తెలియకుండా మ్యాచ్‌లో లీడ్ పెంచుద్ది…
రోహిత్, రాహుల్ ఓపెనింగ్ ఇండియాను సేఫ్ పొజిషన్‌కు తీసుకెళ్ళింది…
ఇండియా గెలిస్తే షమి 13 బూమ్రా 25 సిరాజ్ 7 … పరుగులే గెలిపించినట్టు…